డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాల్కొండ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన మహబూబాబి, నసీమా ఈ ఆరోపణలు చేశారు. ఆర్మూర్‌కు చెందిన ఎరుకల గంగా గీత వద్ద అవసరాల నిమిత్తం రూ.30 వేలు అప్పుగా తీసుకున్నామని తెలిపారు. అసలు మొత్తంతో పాటు రూ.20 వేలు నగదు రూపంలో వడ్డీ చెల్లించామని, అయినప్పటికీ డబ్బులు అందలేదంటూ ఫోన్‌పే ద్వారా రూ.50 వేలు, అల్లుడి ఫోన్ నుంచి మరో రూ.60 వేలు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తం రూ.1.60 లక్షలు చెల్లించినా ఇంకా డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇంటికి వచ్చి రచ్చ చేయడమే కాకుండా తమ రెండేళ్ల చిన్నారిని తీసుకెళ్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మంగళవారం బాల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను కోరుతున్నారు.
News
అప్పు తీర్చేసిన అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఆగడం లేదు... పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు...