జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేత కీర్తి రెడ్డి జూటూరు సూటి ప్రశ్న!
డైలీ భారత్, హైదరాబాద్: అవినీతి లేని కాంగ్రెస్ పాలనను ఊహించుకోలేమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కీర్తి రెడ్డి జూటూరు! తాజాగా అది మరోసారి రుజువైందన్నారు! ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా ఏ చిన్న పని జరగడం లేదంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కీర్తి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు!
రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా చేతులు తడపాల్సిందేనని సొంత పార్టీ ఎమ్మెల్యేనే బహిరంగంగా చెబుతున్నారంటే, క్షేత్ర స్థాయిలో కమీషన్ల వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుందన్నారు!
దీనికేం చెబుతారు?
ఈ విషయాలను ప్రతిపక్ష పార్టీగా బీజేపీ చెబుతుంటే, అంతా ట్రాష్, తప్పుడు ఆరోపణలని కొట్టేపారేసే రేవంత్ రెడ్డి, మీ సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు! స్వయంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ అవినీతి జరుగుతున్న తీరుపై ఆరోపణలు చేస్తుంటే, అందుకు బాధ్యులు మీరు కాదా అని ప్రశ్నించారు కీర్తి రెడ్డి!
విజన్ లేదు.. డైరెక్షన్ లేదు!
రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి పాలనపై, అడ్మినిస్ట్రేషన్ పై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనం అన్నారు! అవినీతిని అరికట్టి, పారదర్శక పాలన అందించడం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యతని గుర్తు చేశారు! ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై తక్షణమే స్పందించి స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్నారు! అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి, వారి హోదాతో సంబంధం లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కీర్తి రెడ్డి!
మా మోదీని చూసి నేర్చుకో!
అంతేకాదు 13 ఏళ్లుగా దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీని చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలన్నారు! తెలంగాణలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనన్న కీర్తి రెడ్డి, అవినీతి రహితమైన పాలన కావాలనుకుంటే, మోదీ నాయకత్వానికి మద్దతు పలకాలని అనిరుధ్ రెడ్డికి సలహా ఇచ్చారు!
#DailyBharath #Hyderabad #JubileeHills #KeerthiReddy #BJP #Congress #RevanthReddy