| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బీజేపీ యువమోర్చా రంగారెడ్డి జిల్లా లీగల్ కో-కన్వీనర్‌గా కంచుకోట మణికంఠ

బీజేపీ యువమోర్చా రంగారెడ్డి జిల్లా లీగల్ కో-కన్వీనర్‌గా కంచుకోట మణికంఠ

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ యువమోర్చా లీగల్ కో-కన్వీనర్‌గా కేశంపేట మండలం పోమల్‌పల్లి గ్రామానికి చెందిన బీజేపీ యువనేత, న్యాయవాది కంచుకోట మణికంఠ నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది.

కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగిన మణికంఠ రాజకీయ ప్రస్థానం గ్రామస్థాయి నుంచే ప్రారంభమైంది. తొలుత పోమల్‌పల్లి గ్రామ బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అనంతరం కేశంపేట మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా నియమితులయ్యారు.

మండల సోషల్ మీడియా కన్వీనర్‌గా పనిచేసిన సమయంలో అన్ని పోలింగ్ బూత్‌లలో సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేసి, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ కార్యక్రమాలు, సమాచారాన్ని బూత్ స్థాయి వరకు చేరవేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు.

ఆయన పనితీరును గుర్తించిన పార్టీ జిల్లా నాయకత్వం రంగారెడ్డి జిల్లా ఐటీ సెల్, సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా అవకాశం కల్పించింది. ఈ బాధ్యతల్లో భాగంగా షాద్‌నగర్, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేశారు.

ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్న మణికంఠకు ఆయన సేవలు, పార్టీ పట్ల నిబద్ధతను గుర్తించి యువమోర్చా జిల్లా లీగల్ కో-కన్వీనర్ బాధ్యతలు అప్పగించడం పట్ల పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన బాధ్యతల్లోనూ మణికంఠ తనదైన ముద్ర వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కార్యకర్తల సేవలను గుర్తించి పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందనే దానికి మణికంఠ నియామకం నిదర్శనమని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Previous అవినీతికి కేరాఫ్ గా కాంగ్రెస్ పాలన! సొంత ఎమ్మెల్యేనే బయటపెట్టాడు! సీఎం రేవంత్ కు కీర్తి రెడ్డి సూటి ప్రశ్న!
Next వేములవాడలో టెన్షన్! రాజన్న ఆలయ గోపురం కూల్చివేత! బీజేపీ నేతల అరెస్ట్! భక్తుల ఆగ్రహం!
ADVERTISEMENT