| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో రోబోటిక్ అద్భుతం! మోకాళ్ల నొప్పులకు చెక్! రోబోతో మోకాళ్ల మార్పిడి విజయవంతం!

కామారెడ్డిలో రోబోటిక్ అద్భుతం! మోకాళ్ల నొప్పులకు చెక్! రోబోతో మోకాళ్ల మార్పిడి విజయవంతం!

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్స్ సెంటర్ లో ఆధునిక రోబోటిక్ టెక్నాలజీ సహాయంతో ఇద్దరు రోగులకు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు రోబోటిక్ జాయింట్ రీప్లేస్ మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ విక్రమ్ బైరి తెలిపారు! మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న రోగులకు ఆధునిక వైద్య సాంకేతికత ద్వారా మెరుగైన చికిత్స అందించే దిశగా ఈ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వివరించారు!

ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్ బైరి మాట్లాడుతూ, దోమకొండ గ్రామానికి చెందిన నరసవ్వకు ఒక మోకాలికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించామని, అదేవిధంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శోభకు రెండు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసినట్లు తెలిపారు! ఇద్దరు రోగులకు వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు పేర్కొన్నారు!

ప్రస్తుతం మోకాళ్ల నొప్పులు, కీళ్ల అరుగుదల సమస్యలతో అనేకమంది బాధపడుతున్నారని, ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ల సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు! నడవడానికి ఇబ్బంది పడటం, మెట్లు ఎక్కలేకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా ఆర్థోపెడిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు!

రోబోటిక్ జాయింట్ రీప్లేస్ మెంట్ విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు! రోగి ఆరోగ్య పరిస్థితి, అవసరాలను బట్టి తగిన చికిత్సా విధానాన్ని వైద్యులు నిర్ణయిస్తారని వివరించారు! ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స పొందే అవకాశం కలుగుతోందని డాక్టర్ విక్రమ్ బైరి పేర్కొన్నారు!

#DailyBharath #Kamareddy #YashodaHospitals #RoboticKneeReplacement #DrVikramBairi #KneePain

Previous కాజు కట్లీ తింటున్నారా? జాగ్రత్త... హైదరాబాద్ లో నకిలీ వెండి పూత దందా...
Next అప్పు తీర్చేసిన అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఆగడం లేదు... పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు...
ADVERTISEMENT