| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇంటర్ చదువుతూనే ఉద్యోగం! ఆన్ జాబ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు! రోహిణి ఆసుపత్రిలో డీఐఈఓ సందర్శన!

ఇంటర్ చదువుతూనే ఉద్యోగం! ఆన్ జాబ్ శిక్షణతో ఉపాధి అవకాశాలు! రోహిణి ఆసుపత్రిలో డీఐఈఓ సందర్శన!

డైలీ భారత్, హన్మకొండ: ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) తో ఉపాధికి అవకాశాలు మెరుగవుతాయని జిల్లా మాధ్యమిక విద్యాధికారి డా శ్రీధర్ సుమన్ అన్నారు! మంగళవారం నాడు పలు ఓజేటీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు, అధ్యాపకులకు మార్గనిర్దేశం చేసారు!

హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో ఆర్డీఎఫ్, పర్వతగిరి జూనియర్ కళాశాల విద్యార్థుల ఆన్ జాబ్ ట్రైనింగ్ కేంద్రాన్ని సందర్శించారు! ఆసుపత్రిలోని ఓపీ వార్డు, క్రిటికల్ కేర్ వార్డు, ల్యాబ్స్, రిపోర్టింగ్ సెల్, ఐసీయూ తదితర విభాగాల్లో విద్యార్థుల పనితీరును పరిశీలించారు!

ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు ఒకేషనల్ విద్యార్థులకు వృత్యంతర శిక్షణ తప్పనిసరని, విద్యార్థుల అనుభవాలను, రికార్డులను పరిశీలించి మార్కులు కేటాయిస్తున్నారని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు! ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వారి రోజువారీ నేర్చుకునే రికార్డులను పరిశీలించారు!

ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని కాసం ఫ్యాషన్స్ లో నర్సంపేట కో-ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థుల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు! జిల్లాలోని అన్ని ఒకేషనల్ కళాశాలలు తమ విద్యార్థులను వృత్తి విద్యలో రాణించేలా మార్గనిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు!

డీఐఈఓ పర్యటనలో కళాశాల ప్రిన్సిపాల్ జనార్ధన్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు!

#DailyBharath #Hanamkonda #OnJobTraining #VocationalEducation #DIEO #RohiniHospital

Previous అప్పు తీర్చేసిన అప్పు ఇచ్చిన వారి వేధింపులు ఆగడం లేదు... పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు...
Next అవినీతికి కేరాఫ్ గా కాంగ్రెస్ పాలన! సొంత ఎమ్మెల్యేనే బయటపెట్టాడు! సీఎం రేవంత్ కు కీర్తి రెడ్డి సూటి ప్రశ్న!
ADVERTISEMENT