డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ & మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ – జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త శకం ప్రారంభమైందని యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సుధీర్ మూడద్ల తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్ మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్సా విధానాల్లో వస్తున్న సాంకేతిక అభివృద్ధి వైద్య చికిత్సలో సరికొత్త మార్పులకు నాంది పలుకుతోందని ఆయన అన్నారు. ఈ ఆధునిక విధానాలు జీర్ణకోశ సంబంధిత వ్యాధుల చికిత్సలో మరింత ఖచ్చితత్వం, మెరుగైన దృశ్య స్పష్టత మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలను అందించేందుకు దోహదపడుతున్నాయన్నారు. ఆహారనాళం, కడుపు, కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి, చిన్నపేగు, పెద్దపేగు మరియు పురీషనాళానికి సంబంధించిన అనేక వ్యాధులకు అధునాతన లాపరోస్కోపిక్ మరియు రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా ఉపయోగించబడుతున్నాయన్నారు. హై-డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యాధునిక శస్త్రచికిత్సా పరికరాలు మెరుగైన కదలికల సామర్థ్యం కలిగిన సాంకేతికతతో, చిన్న కోతల ద్వారానే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా మరింత ఖచ్చితత్వంతో నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు.మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చిన్న కోతలతో శస్త్రచికిత్స
తగిన రోగుల్లో శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గడం, కొన్ని శస్త్రచికిత్సల్లో రక్తస్రావం తగ్గడం, అలాగే వేగంగా కోలుకోవడం రోజువారీ కార్యకలాపాలకు త్వరగా చేరుకుంటారన్నారు. తగిన సందర్భాల్లో ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గడం,క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో మరింత ఖచ్చితత్వం తప్పకుండా యశోద హాస్పిటల్ ప్రజలకు నమ్మకం కలిగిస్తుంది అన్నారు.