| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్ల లేబర్ అడ్డలో కార్మికుల ఆవేదన! భవనం లేదు! మూత్రశాల లేదు!

సిరిసిల్ల లేబర్ అడ్డలో కార్మికుల ఆవేదన! భవనం లేదు! మూత్రశాల లేదు!

సిరిసిల్ల లేబర్ అడ్డలో మూత్రశాలలు లేవు! కార్మికులకు సంఘ భవనం లేదు! ప్రభుత్వానికి డిమాండ్!

డైలీ భారత్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన, లేబర్ అడ్డలో మూత్రశాల నిర్మాణం చేయాలని, నటరాజ్ టాకీస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో భవన నిర్మాణ కార్మిక సంఘానికి భవనాన్ని మంజూరు చేయాలని, లేబర్ అడ్డలో మూత్రశాలలను నిర్మించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్ అన్నారు!

గత ప్రభుత్వ కాలంలోనూ సంఘానికి భవన నిర్మాణం కోసం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు! ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఈ విషయంపై చాలాసార్లు, అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు!

ఎమ్మార్వో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ను కలిసి సంఘం అవసరాలను వివరించినట్లు భాస్కర్ తెలియజేశారు! సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను కూడా కార్మికుల సమక్షంలో కలిసి, భవన మంజూరు, మూత్రశాలల నిర్మాణం కోసం విజ్ఞప్తి చేశామన్నారు!

భవన నిర్మాణ రంగంలో అహర్నిశలు కష్టపడుతున్న కార్మికులకు సంఘ భవనం అవసరమని, లేబర్ అడ్డలో మూత్రశాలలు లేక కార్మికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు! కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల బాధను గుర్తించి, నటరాజ్ టాకీస్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో సంఘ భవనానికి నిధులు మంజూరు చేసి, లేబర్ అడ్డలో మూత్రశాలలు నిర్మించాలని డిమాండ్ చేశారు! భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, ప్రాథమిక సౌకర్యాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు!

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్ తో పాటు, కార్మిక సంఘం నాయకులు అందే సుదర్శన్, ఎస్ కే షాదుల్లా, కోడి ముంజ, గంగాధర్, శంకర్, యాకూబ్, రమేష్, శివ, సత్యం, నవీన్, బాల్రాజ్, మహేష్, శ్రీకాంత్, సంజీవ్, రుక్కవ్వ, పోసవ్వ తదితర కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు!

#DailyBharath #Sircilla #LabourAdda #ConstructionWorkers #Telangana

Previous బీడీ కాలనీలో చిన్నారుల కష్టాలు వర్ణనాతీతం! 3 నెలలుగా బోర్ వెల్ బంద్! ఇళ్లలోకి పాములు!
Next జీర్ణకోశ శస్త్రచికిత్సలో యశోద హాస్పిటల్ సరికొత్త శకం
ADVERTISEMENT