| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి దుకాణాల యజమానులకు వార్నింగ్! కనీస వేతనం ఇవ్వకపోతే కఠిన చర్యలు

కామారెడ్డి దుకాణాల యజమానులకు వార్నింగ్! కనీస వేతనం ఇవ్వకపోతే కఠిన చర్యలు

దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో కనీస వేతనాలు తప్పనిసరిగా అమలు చేయాలి

కార్మికుల లైసెన్సుల నమోదు, సకాలంలో నవీకరణ చేపట్టాలి

సహాయ కార్మిక కమిషనర్ డాక్టర్ ఎం. శశి కుమార్

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ డాక్టర్ ఎం. శశి కుమార్ సూచించారు.

సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయం ఆధ్వర్యంలో దుకాణాలు, వాణిజ్య సంస్థల యజమానులకు కనీస వేతనాల చట్టం అమలు, కార్మిక లైసెన్సుల నమోదు, నవీకరణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కనీస వేతనం తప్పనిసరి

ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శశి కుమార్ మాట్లాడుతూ, ప్రతి దుకాణం, వాణిజ్య సంస్థ యజమాని తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలను తప్పనిసరిగా చెల్లించాలని తెలిపారు. కార్మికుల హక్కులను పరిరక్షించే దిశగా చట్ట నిబంధనలను ప్రతి యజమాని విధిగా పాటించాలని సూచించారు.

లైసెన్సుల నమోదు, నవీకరణ తప్పనిసరి

తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టం ప్రకారం ప్రతి యజమాని తమ సంస్థల నమోదు ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత లైసెన్సులను సకాలంలో పొందాలని, గడువు ప్రకారం వాటిని నవీకరించుకోవాలని తెలిపారు.

అలాగే కార్మికులకు నిర్దేశిత పని గంటలు, వారాంతపు సెలవులు, ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి యజమాని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సహాయ కార్మిక కమిషనర్ సూచించారు.

#DailyBharath #Kamareddy #MinimumWages #LabourDepartment

Previous సమయస్ఫూర్తితో స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్ సిబ్బంది
ADVERTISEMENT