డైలీ భారత్ స్పెషల్:
ప్రమిద దీపాల వెనుక దీనగాథ...
మట్టిని చెమట చుక్కలతో ప్రమిదలుగా
తయారుచేసిన కష్ట జీవిని
చిల్లర బేరాలతో కించపరచకండి..!
పేదవారని జాలి చూపి...
వారి ఆత్మగౌరవాన్ని గాయపరచకండి..!
మనం కొనే ప్రతి ప్రమిదలో
వారి ఆకలి దాగి ఉంది..!
మనం ఇచ్చే ప్రతి పైసలో
వారి సంతోషాల దీపావళి దాగి ఉంది..!
బేరమాడకుండా కొందాము..!
వాళ్ల ఇంటిలో దీపం వెలగనిద్ధాం..!
మానవత్వపు వెలుగుల వెన్నెల్లో
మీ జీవితం నిత్యం ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ…
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
రచన: మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం.