విధుల్లోనే కాదు.. కష్టంలోనూ మేమున్నాం! గుండెపోటుతో హోంగార్డుకు ఆపద.. లక్ష రూపాయలతో ఆదుకున్న సూర్యాపేట పోలీసులు
డైలీ భారత్, సూర్యాపేట: విధుల్లోనే కాదు.. సహోద్యోగి కష్టాల్లోనూ అండగా నిలిచి సూర్యాపేట జిల్లా పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.
చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ప్రముఖ గ్లెనీగిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎస్పీ పిలుపుతో ఏకమైన పోలీసు కుటుంబం
సహోద్యోగుల కష్టసుఖాల్లో ఒక కుటుంబంలా అండగా నిలవాలన్న జిల్లా ఎస్పీ నరసింహ పిలుపుతో జిల్లా పోలీసు సిబ్బంది ఒక కుటుంబంలా ఏకమయ్యారు.
బాలకృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు సిబ్బంది అందరూ కలిసి రూ.లక్ష నగదును సేకరించారు. ఈ మొత్తాన్ని చివ్వెంల ఎస్సై మహేశ్వర్ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు.
సహోద్యోగి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం పోలీసు కుటుంబంలోని ఐక్యత, మానవత్వానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ, పోలీసు అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#DailyBharath #SuryapetPolice #Humanity #Suryapet