డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే లక్ష్యంగా వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థులపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళల్లో పాత నేరస్థుల వద్దకు వెళ్లి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఏం చేశారు?
ఈ తనిఖీల్లో భాగంగా పాత నేరస్థులు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారు, వారి ప్రస్తుత కార్యకలాపాలు ఏమిటి, ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు. తిరిగి నేరాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలలో భాగంగా కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఎస్పీ హెచ్చరిక:
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ...
జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు నిరంతర పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలు చేపడుతూ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
తరచూ నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: జిల్లా ఎస్పీ
#డైలీభారత్ #Sircilla #RajannaSircilla #Police #DailyBharath