ఫోటోగ్రాఫర్లకు పరివార్ కార్డుల పంపిణీ
డైలీ భారత్, పెద్దపల్లి: జిల్లాలోని ఫోటోగ్రాఫర్ ల సంక్షేమానికి కృషి చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల మేళాకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల సౌకర్యార్థం ఫోటో భవ నిర్మాణానికి కృషి చేస్తానని, ₹10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం, అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి పోగుల విజయకుమార్, కోశాధికారి వనపర్తి శ్రీనివాస్, ఫోటోటెక్ టీం ఓం ప్రకాష్, జూలూరి మధు,జిలా కార్యవర్గ సభ్యులు, 14 మండలాల అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిలతో అధిక సంఖ్యలో ఫోటో వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.