Posted on 2026-08-23 19:47:27
ప్రభుత్వ రంగంలోని విద్యను కొనసాగించాలి
డైలీ భారత్, నిజామాబాద్: కార్పొరేట్ సంకెళ్ల నుంచి విద్యను విడుదల చేయాలని ప్రభుత్వ రంగంలోని విద్యను కొనసాగించాలని డెమొక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ మొయినుద్దీన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్య కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. ప్రభుత్వ రంగంలో విద్యా నామమాత్రంగానే కొనసాగుతుందన్నారు. ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ప్రైవేట్ లోనే కొనసాగుతుందన్నారు. ఇంజనీరింగ్ విద్య మొత్తం ప్రైవేట్ లోనే కొనసాగుతుందని. ఈ రాష్ట్రంలో విద్యకు ఒక ప్రత్యేక మంత్రి కూడా లేదంటే ఈ ప్రభుత్వం విద్య పట్ల ఎంత శ్రద్ధ కనబరుస్తుందో అర్థమవుతుందన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకట దాసు మారేడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 36% కేంద్ర ప్రభుత్వం 15% బడ్జెట్ కేటాయించాలని ఇప్పటివరకు ప్రభుత్వాలు ఆ పని చేయడం లేదన్నారు. విద్యను మొత్తం ప్రైవేటుకు అప్పజెప్పితే ప్రభుత్వంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. డాక్టర్ కే వై రత్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రభుత్వం నీరుగార్చిందన్నారు . 70 శాతం ఖాళీలు ఉన్న యూనివర్సిటీ టీచర్స్ ను రిక్రూట్మెంట్ చేయలేదన్నారు. యూనివర్సిటీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం ధ్వంసం చేసింది అన్నారు. 14 ప్రైవేటు యూనివర్సిటీలను తీసుకువచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్కు భిన్నంగా ప్రవర్తించడం లేదని నిజాంబాద్ లో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ యొక్క పరిస్థితిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డి రజిత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిన్లాండ్ , స్వీడాన్ టీచర్లను పంపడం కాదు ఆ దేశాల్లో ఉన్నట్లు మొత్తం విత్తనం ప్రభుత్వ రంగంలోకి తీసుకురావాలన్నారు. ప్రైవేటు రంగం నుంచి విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలన్నారు. విద్యారంగంలో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు చొచ్చుకు రావడం వల్ల నైతిక విలువలు సామాజిక విలువలు దెబ్బతింటున్నాయి అన్నారు తెలంగాణ ప్రభుత్వం శాస్త్రీయ విద్యను అందించడం లేదని వక్త ఎం.ఎన్ నరసయ్య అన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రజిత హైకోర్టు అడ్వకేట్ గోపాల్ ఐఎంఐ నాయకులు సదానందం షహీన్ స్వప్న బండారి నరసయ్య బండారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
ఘోర అగ్నిప్రమాదం... ఆసుపత్రి ఎన్‌ఐసీయూలో వెంటిలేటర్ పేలి ముగ్గురు పసికందుల మృతి
Posted On 2026-08-24 04:46:01
Readmore >
కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం
Posted On 2026-08-23 19:44:16
Readmore >
గుడిమల్కాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం... ఆరు ఫర్నిచర్ గోదాములు పూర్తిగా దగ్ధం
Posted On 2026-08-23 12:46:15
Readmore >
మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Posted On 2026-08-23 09:29:29
Readmore >
ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఏకాభిప్రాయంతో నేటి నుండి కొత్త EHS పథకం అమల్లోకి
Posted On 2026-08-22 15:24:13
Readmore >
ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్.
Posted On 2026-08-22 14:51:17
Readmore >