| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్.

ప్రణాళిక ప్రకారం రాజన్న ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులపై సమీక్ష.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

వేములవాడ పట్టణంలో వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణం, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులపై శనివారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా అవసరమైన మేరకు కూలీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ భీమ్లా నాయక్, ఆలయ ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, స్థపతులు మోతిలాల్, సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

#RajannaSircilla #Vemulawada #RajannaTemple #RajarajeshwaraSwamy #CollectorGarimaAgrawal #TempleDevelopment #BaddipochammaTemple

Previous హైదరాబాద్‌ : మాదాపూర్‌లో కుప్పకూలిన ఏడంతస్తుల కట్టడం.. ఇద్దరు కూలీలు మృతి!
Next ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ఏకాభిప్రాయంతో నేటి నుండి కొత్త EHS పథకం అమల్లోకి
ADVERTISEMENT