డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా విద్యారంగంలో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ - YIIRS ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది.
పాఠశాల విద్యాశాఖ http://G.O.Rt.No.145, తేదీ 04-08-2026 ద్వారా పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
YIIRS ప్రత్యేకతలు
నిర్మాణ వ్యయం: రూ.200.00 కోట్లు
ప్రాంతం: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఒక మండలం
ఏర్పాట్లు: స్కూల్ + జూనియర్ కాలేజ్ ఒకే క్యాంపస్‌లో
సదుపాయాలు: స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అడ్వాన్స్‌డ్ ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ, ఇండోర్ + అవుట్‌డోర్ స్పోర్ట్స్, హాస్టల్, మెస్, 24/7 సెక్యూరిటీ
"CM రేవంత్ రెడ్డి విద్యను ప్రాధాన్య అజెండాగా తీసుకున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఏ పేద విద్యార్థి చదువు ఆగకూడదనేదే మా సంకల్పం. ఈ YIIRS ద్వారా కామారెడ్డి యువతకు జాతీయ స్థాయి పోటీకి తగ్గ శిక్షణ అందుతుంది. ఇది కామారెడ్డిని తెలంగాణ విద్యా మ్యాప్‌లో ప్రత్యేకంగా నిలబెడుతుంది" అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యాసంస్థల ఆధునీకరణ, డిజిటల్ విద్య, కొత్త భవనాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమా శ్రీనివాస్, డిసిసి మాజీ అధ్యక్షులు కైలా శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
త్వరలోనే స్థల సేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభమై నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.
#Kamareddy #YIIRS #TelanganaGovt #Education #RevanthReddy #MohammedAliShabbir