డైలీ భారత్, కామారెడ్డి : బడుగు,బలహీన వర్గాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
నిజాం నిరంకుశ పాలనలో బూస్వాములు,పెత్తం దారులు రాజ్యం ఏలుతున్న రోజుల్లో అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడి,కుల మతాలకు అతీతంగా ఆడపిల్లల వివాహలు చేసి ప్రతీ కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పండుగ సాయన్న ముదిరాజ్ వర్గానికి చెందిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కేవలం 36 సంవత్సరాల కాలంలోనే బహుజన రాజ్యాధికారం కావాలని ఆశించిన వ్యక్తి అని, తనని చంపాలని బూస్వాములు పథకం వేస్తే సామాన్య ప్రజలందరూ కలిసి తిరగబడడం జరిగింది.అలాంటి గొప్ప వీరుడి వ్యక్తిత్వం బావితరాలకు తెలియాలని అన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజ్ సామాజిక వర్గాల ఆత్మ గౌరవనికి సూచికగా జిల్లా కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయాలని నిశ్చయించినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ముదిరాజ్ నాయకులు ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, పున్న రాజేశ్వర్,నీల నాగరాజు,గజ్జెల బిక్షపతి,నంద రమేష్, గేరిగంటి లక్ష్మి నారాయణ,సునుగూరి బానుప్రకాష్,దాకి అరవింద్,కాళ్ళ గంగారాజు,పిల్లి మల్లేష్,చింతల రమేష్,మోడేగామ్ మహేష్, బట్టు నర్సింలు,ప్రసాద్,బర్ల స్వామి,కనికంటి రమేష్,నర్సింలు,చిట్యాల రమేష్, పిట్ల శంకర్, కనకంటి రమేష్,బాల్ నర్సులు,స్వామి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.