డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో నూతనంగా ఒక్క వెసులుబాటు కల్పించలేదని, వేతన జీవులను పూర్తిగా నిరాశ పరిచిందని *తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి* ఆవేదన వ్యక్తం చేసారు. కొత్త పన్నుల విధానంలో 80సి,80డి, ఇంటి అద్దె, విద్య, గృహ రుణాలపై వడ్డీ తదితర మినహింపులు వర్తింపచేయాలని మూడేళ్లుగా సంఘాలు కోరుతున్న పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణలు చేసి పన్నుల భారం తగ్గించి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కాస్తయినా ఉపశమనం కలిగించాలని వారు కోరారు. ప్రత్యేక్ష పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ పాల్గొన్నారు.