డైలీ భారత్, వరంగల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అవిశ్వాస తీర్మాన పత్రాన్నిమంగళవారం అందజేశారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు చైర్ పర్సన్ కి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. లేఖలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్ విశ్వాసం కోల్పోవడంతో అవిశ్వాస తీర్మానానికి మొగ్గు చూపినట్టు స్పష్టం చేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ ఒంటెద్దు పోకడలతో నర్సంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నట్లు ఆరోపించారు.ఈ కారణంగానే చైర్ పర్సన్ పై తమకు విశ్వాసం లేదని తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే తగిన చర్యలు తీసుకుంటూ, నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ ని కోరారు. ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు...