Posted on 2026-04-13 13:09:06
డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ హత్యకు గురైంది.
కున్నం తాలూకా పుదువెట్టక్కుడి గ్రామానికి చెందిన పెరియసామి–నందిని(28) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం పెరియసామి అనారోగ్యంతో మరణించాడు. ఆ తర్వాత నందిని తన పిల్లలను అత్తగారింట్లో వదిలి, పెరంబలూర్లోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేపట్టింది
అదే హోటల్‌లో పనిచేస్తున్న పచ్చముత్తుతో నందిని సన్నిహితమైంది. ఈ విషయం పచ్చముత్తు భార్య సత్యకు తెలిసి, ఆమె భర్తను మందలించింది. అయినా అతను మారకపోవడంతో మనస్తాపానికి గురైన సత్య సుమారు ఏడాదిన్నర క్రితం ఆత్మహత్య చేసుకుంది.
సత్య మరణం తర్వాత పచ్చముత్తు, నందిని కలిసి భారతీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఈ మధ్య నందిని ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడుతుండటంపై పచ్చముత్తుకు అనుమానం వచ్చి తరచూ గొడవలు జరిగేవి.శనివారం రాత్రి ఇద్దరి మధ్య మళ్లీ గొడవ చెలరేగింది. కోపంతో పచ్చముత్తు దాడి చేయడంతో నందిని అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం పచ్చముత్తు స్వయంగా పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >