| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

అంబులెన్స్ సేవలు వేగంగా అందుకోవాలి

ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ లు పెరగాలి

నులి పురుగులు నివారణ తో పిల్లలు ఆరోగ్యం గా ఉంటారు

ప్రభుత్వ హాస్పిటల్ లో సిబ్బంది నియామకానికి ప్రపోజల్స్ తయారు చేయండి

జిల్లా కలెక్టర్ రాజర్షి షా

డైలీ భారత్, మెదక్:స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్, విడియో సమావేశ మందిరంలో మంగళవారం  వైద్య అధికారులతో విడి విడి గా జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రభుత్వ హాస్పిటల్ సేవలు,సిబ్బంది,డెలివరీ లు ,ఫిబ్రవరి 12 న నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా లోని పిల్లలందరికీ ఫిబ్రవరి 12 న నులిపురుగులు నివారణ కోసం నివారణ టాబ్లెట్స్ వేయాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్  ఆదేశానుసారము, "ఎనీమియా ముక్త్ భారత్ " కార్యక్రమం కింద మెదక్ జిల్లాలో ఎనీమియా ముక్త్ తెలంగాణ  కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది, 

ముఖ్య ఉద్దేశం కిశోర వయసు బాలికల్లో రక్తహీనత నివారించి వారిని ఆరోగ్యవంతులుగా చేయటం, ఈ కార్యక్రమం

 24 జనవరి 2024 నుంచి 10 ఏప్రిల్ 2024 వరకు (ఆర్ బి ఎస్ కే) రాష్ట్రీయ బాల్య సురక్ష కార్యక్రమం,మొత్తం (6) టీం ల ద్వారా మెదక్ జిల్లాలో ఉన్న 32,850 మంది పిల్లలకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలలో (8 నుండి12 తరగతుల బాలికలు అందరికీ  ) పైన పేర్కొన్న 6  ఆర్ బి ఎస్ కే టీం ల ద్వారా యాక్షన్ ప్లాన్ ప్రకారం రక్త పరీక్షలు నిర్వహించి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పిల్లలందరినీ గుర్తించి వారికి మూడు  నెలలపాటు బ్లూ( నీలం) కలర్ ఐరన్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది, మరియు దీంతోపాటు ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం అయిన  ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బెల్లము, ఖర్జూర పండ్లు, లివర్, దానిమ్మ పండ్లు, గుడ్లు మొదలగు ఆహారాలు ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని తెలియ చేయటం జరుగుతుంది, మరియు స్కూలుకు వెళ్ళని పిల్లలను గుర్తించి వారిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకొని వారికి ఐరన్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది, మరియు ఐరన్ పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం  జాగ్రత్తలు వివరించడం జరుగుతుదన్నారు.ఈ కార్యక్రమం లోడిఎం &ఎచ్ం చందు నాయక్,విజయ నిర్మల,మాధురి,అలిలా ,అరున శ్రీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ రాజర్షి షా
Next బొడిగే గాలన్న మాదిగకు నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ
ADVERTISEMENT