| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక నియోజకవర్గం లో పలు రహదారుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా వినతిపత్రం అందజేశారు

రూ. 33 కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి

డైలీ భారత్, మెదక్: ఉమ్మడిమెదక్ దుబ్బాక నియోజకవర్గంలో పలు రహదారులకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం రాత్రి ఆర్ అండ్ బి (రోడ్డు భవనాల) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి విన్నవించారు.

నియోజకవర్గంలోని మెట్టు -దౌల్తాబాద్ హైదరాబాద్ బ్రిడ్జి ,వయా తిమ్మాపూర్ పద్మనాభంపల్లి మీదుగా రోడ్డు నిర్మాణానికి సిఆర్ఎఫ్ నిధులు       రూ. 25 కోట్లు విడుదల చేయాలని, దీంతోపాటు మొండి చింత బేగంపేట్ వరకు ఉన్న సింగల్ రోడ్డు ను డబుల్ రోడ్డు గా విస్తరించేందుకు రూ .7 కోట్లు మంజూరు చేయాలన్నారు.     చేగుంట -బోనాల రోడ్డు నిర్మాణానికి రూ. 70 లక్షలు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి విన్నవించారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని , నిధులు మంజూరుకు ఆయన హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Previous అయోధ్యలో వైభవంగా బాల రాముడి ప్రాణ ప్రతిష్ట
Next విద్యార్థిని అభినందించిన కౌన్సిలర్లు గేoట్యాల శ్రీనివాస్ మరియు వేముల రవి
ADVERTISEMENT