ఓటరు జాబితా లో డబల్ ఓట్లను ఓటరు జాబితా లో పేర్లు తొలగించాలి
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
డైలీ భారత్, మెదక్:మెదక్ పట్టణం లోని జిల్లా అటవీ శాఖ కార్యలయం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 136,138, కుల్చారం మండలం, అప్పజిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం 55 లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ను శనివారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు .
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో బి.ఎల్.ఓ. ల వద్ద ఓటరు జాబితా, అవసరం మేర ఫారం-6,7,8 అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, కొత్తగా ఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, పేరు మార్పు చేర్పుల పై మార్పులు కోరుతూ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారా అనే వివరాలు బి.ఎల్. ఒ లను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం గురించి గ్రామాలలో చాటింపు వేసి ప్రచారం చేయాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు.
ఫారం 7 జనరేషన్ ఎలా చేస్తునారని ,బి.యల్.ఓ యాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటరు నమోదుకు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు వస్తున్న దరఖాస్తులను పరిశీలించారు. ఫోటో, డబల్ ఎంట్రి మరియు ఇతర పొరపాట్లు లేకుండా సరిచేయాలని తెలిపారు. ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అన్ని పోలింగ్ బూతులలో కొనసాగుతాయని, ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది పరిశీలించుకోవాలన్నారు. లేనివారు వెంటనే ఫారం-6 ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సం. నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవడంలో అవగాహన కలిగించాలన్నారు.
ప్రత్యేక శిబిరాల అనంతరం బూతు స్థాయి అధికారులు,సూపర్వైజర్లు ఇంటింటా సర్వే చేపట్టి అర్హత గల ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు.ఓటర్ టర్న్ అవుట్ తక్కువగా ఉన్న చోట ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఓటరు జాబితాలలోని డబుల్ ఎంట్రిలను గుర్తించి రిమార్క్ లతో కూడిన చెక్ లిస్ట్ జాబితాను బి ఎల్ ఓ లకు ఇచ్చి ఇంటింటి సర్వే ద్వారా పరిశీలించి నివేదికను రూపొందించి అందజేయాల్సిందిగా సూచించారు. ఒకే కుటుంబం లోని ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు కలిగివుండేలా ఓటర్ నమోదు చేయాలనీ పేర్కొన్నారు . మృతి చెందిన వారి మరణ ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల నుండి సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు.
వివిధ కారణాల వల్ల ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మారినట్లైతే, ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో ఓటర్లకు తెలియజేయాలని, తద్వారా వారు పోలింగ్ సమయంలో గందరగోళానికి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని కలెక్టర్ అన్నారు. జనవరి 20,21 తేదీలో శని,అది వారాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఓటరు గా నమోదు కావడానికి ఇదే చివరి అవకాశం కావున, జిల్లా ప్రజలు ఈ ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమం మెదక్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, నర్సాపూర్ ఆర్డీఓ,శ్రీనివాసులు ,తహసీదార్లు శ్రీనివాస్, చంద్ర శేఖర్ , ఎంపిడిఓ గణేష్ రెడ్డి, బి ఎల్ ఓ సూపర్ వైజర్లు , బి ఎల్ ఓ లు ,తదితరులు పాల్గొన్నారు.