జిల్లా కలక్టర్ రాజర్షిషా
డైలీ భారత్, మెదక్:రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ హైదారాబాద్ వారి ఆదేశాల మేరకు ఈ నెల 18,19 వ తేదీ ల లో జిల్లా స్థాయి వైజ్ఞానిక, గణిత,పర్యావరణ ప్రదర్శనను వర్చువల్ పద్దతిలో నిర్వహించడం జరిగినది. ఈ ప్రదర్శనలో మొత్తం 181 ఎగ్జైబిట్స్ ఆన్లైన్ లో నమోదు చేయ బడ్డయన్నరు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా: హుస్సేన్ నేతృత్వం లో నీ కళాశాల అధ్యాపకుల అధ్వర్యంలో మూల్యాంకనం చెయ్యడం జరిగింది.ఈ ఫలితాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మొత్తం ఐదు అంశాలలో సీనియర్,జూనియర్ విభాగాలుగా ప్రతి అంశం లో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగిందని,మొదటి స్థానం పొందిన విద్యార్థులు మాత్రమే వర్చువల్ పద్దతిలో జరిగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక గణిత పర్యావరణ ప్రదర్శనలో పాల్గొంటారన్నారు.
విజేతలను అభినందించారు. ఇదే స్ఫూర్తి తో రాష్ట్ర స్థాయి లో జరిగే ప్రదర్శనలో పాల్గొని మెదక్ జిల్లా కు మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, డి ఇ ఒ రాధా కిషన్,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,మండల విద్యాధికారి నీలకంఠం,మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.