డైలీ భారత్, వేములవాడ: ఈరోజు వేములవాడలో జిల్లా రా రైస్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ...
రైస్ మిల్లర్ల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక తోడ్పాటు అందిస్తుంది, రైతుల ఆర్థిక అభివృద్ధిలో రైస్ మిల్లర్ల పాత్ర అత్యంత కీలకం, రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రా రైస్ అసోసియేషన్ అధ్యక్షులు పబ్బ నాగరాజు, గౌరవ అధ్యక్షులు గరిపెల్లి ప్రభాకర్, వంశీ, సత్యం రావు, ప్రధాన కార్యదర్శి రాజీరెడ్డి, కోశాధికారి చేపూరి శ్రీనివాస్, చికోటి శ్రీహరి, బాసెట్టి రవీందర్, ఎర్ర శ్రీనివాస్, దైత కుమార్, నాగారం శ్రీనివాస్, చీకోటి నాగరాజు, చీకోటి అశోక్, ముక్తిశ్వర్, బండ శ్రీనివాస్ తోపాటు జిల్లాలోని వివిధ మండలాల రైస్ మిల్లర్ల యజమానులు వ్యాపారవేత్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..