డైలీ భారత్, మెదక్ : తెలంగాణకు హరితహారం క్రింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాదించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
గురువారం కలెక్టరేట్ కార్యలయం లోని సమావేశ మందిరంలో హారీతహారం కార్యక్రమంపై జిల్లా అటవీ శాఖ అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025 , 2026 వార్షిక సంవత్సరాలలో వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటుటకు లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుగుసాగాలని కోరారు. అధికారులు లక్ష్యం సాధించాలనే తపనతో కాకుండా మనస్సు పెట్టి నాటిన ప్రతి మొక్క పాడవకుండా జీవించేలా చూడాలని, ఔషధ మొక్కలు, నీడ నిచ్చే మొక్కలు, పూల మొక్కలు, రహదారుల వెంట పెద్ద మొక్కలు నాటాలని అన్నారు.
2024 సంవత్సరంలో 27 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, కాగా 2025 సంవత్సరంలో 25 లక్షల మొక్కలు నాటుటకు కార్యాచరణ రూపొందించామని, అదేవిధంగా 2026 నాటికి 25 లక్షల మొక్కలు నాటుటకు ఇప్పటి నుండే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు.
క్షేత్ర స్థాయిలో నీటిపారుదల క్రింద బండ్ ప్లాంటేషన్, అటవీ శాఖ పరిధిలో బ్లాక్ ప్లాంటేషన్, గ్రామ పంచాయతీలు, విద్యా సంస్థలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటాలన్నారు. ప్రధానంగా కరివేపాకు, మునగ, ఉసిరి, చింత, వెలగ వంటి మొక్కలతో పాటు తులసి, అలవీరా, రణపాల వంటి ఔషధ మొక్కలు నాటాలని కోతులు దరిచేరవని అన్నారు. కోతులు బయట సంచరించకుండా అటవీ లోపల పండ్ల మొక్కలు నాటాలని అన్నారు. యెన్.ఆర్.జి.ఎస్. క్రింద రైతులు పండ్ల మొక్కలు నాటేలా ప్రోత్సహించాలని, , ఆయిల్ ఫార్మ్స్ ను ప్రోత్సహించాలన్నారు. పశువులకు గడ్డి కొరకు ప్లాంటేషన్ చేయాలన్నారు. గ్రామ పంచాయతీలలో అంతర్గత, బహిర్గత రహదారుల వెంట, మునిసిపల్ ప్రాంతాలలో మీడియన్ లో పెద్ద మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలు నాటాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో కిచెన్ గార్డెన్లతో పాటు మునగ చెట్లు నాటాలన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డు, క్వారీలు, ఆర్టీసీ, ట్రాన్స్కో, ఆర్టీఓ తదితర అన్ని కార్యాలయాల వద్ద పద్ధతి ప్రకారం మొక్కలు నాటాలన్నారు. చెట్లు కొట్టిన, తొలగించిన వారిపై తగు చర్యలు తీసుకుంటమన్నరు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ , జెడ్పి సీఈఓ శైలేష్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ , జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్ జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా ,ఎంపిడిఓ లు ,మున్సిపల్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.