| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసిన కిలాడీ లేడీ

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేసిన కిలాడీ లేడీ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఓ కిలాడి లేడీ టోకరా వేసింది. ఏకంగా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్అండ్ బీ సీఈ సంతకాలు ఫోర్జరీ చేసి నియామక పత్రాలు సృష్టించింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసింది. నియామక పత్రాలు నకిలీవని తేలడంతో బాధితులు జిల్లా కేంద్రంలోని మూడో టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Previous ఐద్వా జాతీయ మహాసభకు వేలాదిగా కదిలి రండీ
Next బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదు : బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
ADVERTISEMENT