| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

అర్ధరాత్రి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు

డైలీ భారత్, పెద్దపల్లి జిల్లా:ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో చోటుచేసుకుంది.

శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో నిమ్మనపల్లి నుండి పెద్ద కలువలకు వెళ్తున్న టీ ఎస్ 10 ఈఎల్ 2029 అనే నంబర్ గల నెక్సా కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకు వెళ్ళింది.

ఈ ప్రమాదంలో రంగంపల్లికి చెందిన వినీత్ రెడ్డి అక్కడి  కక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న గాదె అఖిల్, అల్లం బాల అనురోహిత్ రెడ్డి, సాయిలు బావిలో నుండి పైపు ద్వారా బయ టికి వచ్చి క్షేమంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ సంఘటన స్థలాన్ని పరి శీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


#peddapalli

Previous గర్భిణీ మహిళ కు కాన్పు చేసిన ఎమ్మెల్యే
Next గాలిపటం ఎగురవేస్తూ బాలుడు మృతి
ADVERTISEMENT