| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్..

లాడ్జిలో వ్యభిచారం.. ఇద్దరు అరెస్ట్..

జిల్లాలో యదేచ్ఛగా కొనసాగుతున్న దందా..

ముంబై రెడ్ లైట్ ను తలపిస్తున్న జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు 1 టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో లక్ష్మీ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. లాడ్జి నిర్వాహకులు సాయిలు, రాజును అరెస్టు చేశారు. మరో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే జిల్లా కేంద్రంలో బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా వ్యభిచార ముఠా అదే ప్రాంతంలోనే తిరుగుతూ మగవారిని ఆకర్షించేలా అందాలు వలకబోస్తూ వారి జేబులో ఉన్న నగదు ఇతర వస్తువులను వారి మాయమాటలతో మగవారిని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ దందా ముంబైలోని రెడ్ లైట్ ఏరియా ను తలపిస్తుంది. దీనికి ఎప్పటికప్పుడు నిజామాబాద్ వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి వారి ఆగడాలను ఆదిలోనే తుంచాలనే ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు. దీంతో సదరు ఎస్హెచ్ఓ కు నిజామాబాద్ వాసులు అభినందనలు తెలుపుతున్నారు.

Previous విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవతా దృక్పథంతో ఒకరి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్
Next నిషేధిత గంజాయిని సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసిన సుజాతనగ్ ఎస్సై రమాదేవి
ADVERTISEMENT