| Daily భారత్
Logo




కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఆర్ఓబీ పనులు పూర్తి చేయని రాష్ట్ర ప్రభుత్వం

News

Posted on 2025-10-08 11:56:50

Share: Share


కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఆర్ఓబీ పనులు పూర్తి చేయని రాష్ట్ర ప్రభుత్వం

చేత కాకపోతే జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి..

బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లాలో ఆర్ఓబి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ కు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విఫలం చెందిందని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం మాధవ్ నగర్ ఆర్ఓబి బ్రిడ్జి వద్ద బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ తీర్పు నిరసనగా రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం మట్టిని తవ్వి గుంటల్లో పేర్చారు. జిల్లా కాంగ్రెస్కే పెద్దమనిషిగా చెప్పుకునే సుదర్శన్ రెడ్డి మంత్రిగాని మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా ఇదే అయినప్పటికీ ఆరోపణల్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్ఓబి పనులు త్వరగా చేపట్టకపోవడం వల్ల రోజుకు పదుల సంఖ్యలో గుంతలో పడి గాయాల పాలవుతున్నారని ఆయన అన్నారు. కేవలం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతాకానితనం వల్లే జిల్లాకి ముఖద్వారం లాంటి మాధవ నగర్ ఆర్ఓబి పనులు నిలిచిపోవడం సిగ్గుచేటు అన్నారు. వారికి చేతకాకపోతే రాజీనామా చేయాలని మండిపడ్డారు. రాస్తారోకో కార్యక్రమం వల్ల భారీగా వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. బిజెపి జిల్లా కార్యదర్శి రాంపల్లి జ్యోతి, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బీ వరలక్ష్మి, నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ నిజామాబాద్ నగరపాలక సంస్థ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతాన్ కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >