| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నగరంలో జిల్లా స్థాయి యోగ ఆసన క్రీడ పోటీలు

నగరంలో జిల్లా స్థాయి యోగ ఆసన క్రీడ పోటీలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగ ఆసన క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు  ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమాకి  ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నరసయ్య జ్యోతి ప్రజ్వలన చేసి యోగ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగ క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దారుఢ్యాన్ని  పెంపొందించేందుకు దోహదపడుతోందని అన్నారు. యువత యోగ క్రీడాంశాల్లో పాల్గొంటూ జాతీయ,అంతర్జాతీయ స్థాయిల్లో తమ సత్తాను చాటుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం యోగ కు ఓ ప్రత్యేక స్థానం కల్పిస్తూ భారతదేశం ప్రపంచ దేశాలకు సైతం యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దేశం యొక్క ఉనికిని చాటి చెబుతోందని చెప్పారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగరత్న ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు యోగా రామచందర్ మాట్లాడుతూ సమస్త మానవాళి యోగ ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే ఉద్దేశంతో ప్రధాని మోడీ ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రచారం చేయించి అందరి మన్ననలను పొందారన్నారు. యోగ ద్వారా శారీరక,మానసిక ఉల్లాసం తో పాటు ఎటు వంటి అనారోగ్య సమస్యలు తలెత్త కుండా శరీరంలో ని సమస్త నాడులను ఉత్తేజపరిచేందుకు ఈ యోగాసనాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరు నిత్యం యోగాసనాలను వేస్తూ  తమదైనందిన జీవితాలను సుగమనం చేసుకోవాలని తెలియజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగీత, సాయిలు జిల్లా స్థాయి యోగ ఆసన క్రీడల్లో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుండి విద్యార్థులు,యువత , తల్లిదండ్రులు అధిక సంఖ్యలో  క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.

Previous కామారెడ్డి లో పరిస్థితి దారుణంగా ఉంది
Next శీర్షిక : ఉపాధ్యాయ దినోత్సవం
ADVERTISEMENT