| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కంటైనర్... సీఐ, కానిస్టేబుల్ కి గాయాలు

పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన కంటైనర్... సీఐ, కానిస్టేబుల్ కి గాయాలు

డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం డొలారా వద్ద జాతీయ రహదారిపై జైనథ్ సీఐ సాయినాథ్, కానిస్టేబుల్ షబ్బీర్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వచ్చిన కంటైనర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ, కానిస్టేబుల్ లు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అదే విధంగా.. గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్‌ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు.

Previous కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..
Next వాడి గ్రామంలో వరద నీరు రావడంతో భాధితులను పరామర్శించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
ADVERTISEMENT