| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ముంపు గ్రామాలను సందర్శించిన రూరల్ ఎం ఎల్ ఏ, జిల్లా కలెక్టర్, సీ.పి

ముంపు గ్రామాలను సందర్శించిన రూరల్ ఎం ఎల్ ఏ, జిల్లా కలెక్టర్, సీ.పి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉద్ధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో ధర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమి తండా, బీరప్ప తండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, సీ.పీతో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉద్ధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఒన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన పరిశీలించారు.

Previous హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు 1000/- జరిమానా
Next కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..
ADVERTISEMENT