| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వ‌ర‌ద‌లో చిక్కుకున్న వారికి కేంద్ర మంత్రి ఫోన్

వ‌ర‌ద‌లో చిక్కుకున్న వారికి కేంద్ర మంత్రి ఫోన్

డైలీ భారత్, గంభీరావుపేట:సిరిసిల్ల జిల్లా లోని గంభీరావుపేట  సమీపంలో ఎగువ మానేరులో చిక్కుకున్న బాధితుడు స్వామితో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. భ‌య‌ప‌డొద్ద‌ని, అధికారులు మిమ్మ‌ల్ని కాపాడుతార‌ని ధైర్యం చెప్పారు. స్వామితోపాటు మిగిలిన నలుగురు బాధితులు పిట్ల మహేశ్, పిట్ల స్వామి, ధ్యానబోయిన స్వామి పరిస్థితిపైనా సంజయ్ ఆరా తీశారు. బాధితులెవ‌రూ భ‌య‌ప‌డొద్దని ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భయపడటం లేదని, అధికారులు కాపాడతారనే నమ్మకం ఉందని స్వామి చెప్పారు.

Previous ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
Next కామారెడ్డి ఉదృతంగా కురుస్తున్న భారీ వర్షానికి ఒకరు మృతి
ADVERTISEMENT