| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి జిల్లా సెట్లూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కామారెడ్డి జిల్లా సెట్లూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

28 మంది విద్యార్థులకు అస్వస్థత

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ సోమవారం కలకలం రేపింది. బిచ్కుంద మండలం షెట్లూర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి  అయితే అందిస్తున్నారు. బాధిత విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శించారు. మధ్యాహ్న భోజనం చేశాక విద్యార్థులకు వాంతులు విరేచనాలు అయ్యాయి. నాణ్యత లేని భోజనమే కారణమని తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వంట చేసిన ఏజెన్సీ ని తొలగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరచుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడుల్లో ఇలాంటి ఘటనలు తరచూ కావడంతో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన ఆహారాన్ని అందించాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించినప్పటికీ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినాలంటే చావుని కొన్ని తెచ్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం విద్యార్థుల తల్లిదండ్రులల్లో అభిప్రాయం ఏర్పడుతుంది.


#kamareddy #foodpoison

Previous ఎంబిబిఎస్ విద్యార్థిపై ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్ విద్యార్థుల సస్పెన్షన్
Next మూడు సంవత్సరాల పాపని హింసించిన కేసులోని నిందితుడికి జైలు మరియు జరిమానా
ADVERTISEMENT