| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి

గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలి

ప్రతి ఒక్కరూ పర్యావరణ అనుకూలమైన వినాయక చవితి జరుపుకోవాలి

గణేష్ పండల్ల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తప్పనిసరి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టుతనమని నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు మీ పోలీసులకు సహాకరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్ అన్నారు. ఈ నెల 27న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని గణేష్ మండపములకు సెక్యూరిటీ ఇవ్వడానికి, పాయింట్ బుక్ ఏర్పాటుకోసం సమాచారం ఇవ్వలన్నారు.

ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వాడకం చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు అగ్ని ప్రమాదం సంభవిస్తే ముందస్తు భద్రతా ఏర్పాట్లు, వర్షం వచ్చినప్పుడు తీసుకోవల్సిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.

మండపాల నిర్వాహకులు కొంతమంది స్వచ్ఛంద సేవకులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.

Previous అపార్ట్మెంట్లో కూడా చోరీలకు వెనుకడుగు వేయని దొంగలు
Next రేవంత్ రెడ్డికి బీసీలంటే చిన్నచూపు : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
ADVERTISEMENT