డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్:తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని, కంటేశ్వర్ సర్కిల్లో గల కాంస్య విగ్రహానికి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా పక్షాన... పూలమాలవేసి నివాళులర్పించారు. స్మరించుకున్న ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, నేతికుంట శేఖర్, టిఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ గారు,జిల్లా జాయింట్ సెక్రెటరీ జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, భీంగల్ యూనిట్ అధ్యక్షులు సృజన్ కుమార్, స్పెషల్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యప్రకాష్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News
ఆచార్య జయశంకర్ జయంతి పురస్కరించుకొని టీఎన్జీవో ఆధ్వర్యంలో నివాళులు