| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇందూరులో ఒకరి కూరగాయల తోటలో కాసిన వింత ఆకారపు సొరకాయ

ఇందూరులో ఒకరి కూరగాయల తోటలో కాసిన వింత ఆకారపు సొరకాయ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒకరి నివాసంలోని కూరగాయల తోటలో వెరైటీ ఆకారపు సొరకాయ కాసింది. ఈ వింతను చూడటానికి చుట్టుపక్క ఇండ్లలోని వారు ఆశ్చర్యచకితులయ్యారు. సాధారణంగా సొరకాయ పొడవు ఆకారంలో ఉండడం మార్కెట్లో చూస్తూ ఉంటాం కానీ వారి కూరగాయల తోటలో మాత్రం గల్లబుడ్డిని తలపించేలా  ఓ సొరకాయ కాయడంతో ఇదేదో వింత ఆకారమని, దీనికి తోడు గణపతి ఆకారంలో ఈ సొరకాయ కాసిందని మరికొందరు చర్చలకు తెర లేపారు. మొత్తానికి గుండ్రపు ఆకారంలో ఈ సొరకాయ కాయడంతో ఇదేదో ప్రకృతి వింతనేనని మరికొందరు చర్చించుకుంటున్నారు.

Previous భూవివాదంలో మహిళను హత్య చేసిన రౌడి షీటర్ పై పీడీ యాక్ట్ నమోదు
Next శీర్షిక : బోనాలు తెచ్చాము ఓయమ్మా
ADVERTISEMENT