| Daily భారత్
Logo




“తెలంగాణ: ఫ్యూచర్ రెడీ” – ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం

News

Posted on 2025-04-23 19:23:00

Share: Share


“తెలంగాణ: ఫ్యూచర్ రెడీ” – ఉపాధ్యాయ సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం

డైలీ భారత్, హైదరాబాద్:విద్యా శాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. యోగితా రాణా, IAS ఆధ్వర్యంలో “తెలంగాణ: ఫ్యూచర్ రెడీ” పేరిట ఉపాధ్యాయ సంఘాలతో ఒక ప్రత్యేక సమావేశం హైదరాబాద్‌లోని గోదావరి హాల్, SCERT ప్రాంగణంలో నిర్వహించబడింది.


ముందుగా EV Narsimhareddy IAS,DSE మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పెర్ఫార్మన్స్ NAS,ASER ల లో  ఏవిధంగా ఉంది ,స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ Govt Schools లో ఏవిధంగా తగ్గుతుందో పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు .

Secretary madam మాట్లాడుతూ  నాణ్యమైన విద్యను మరియు క్వాలిటీ ని పెంచడానికి మరియు ఎన్రోల్మెంట్ పెంచడానికి సలహాలు కోరడం జరిగింది.

ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలను దత్తత తీసుకొని క్వాలిటీ పెంచాలని కోరడం జరిగింది.తదనుగుణంగా అన్ని సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ క్రింద తెలిపిన సలహాలు /సూచనలు చేయడం జరిగింది 

-బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి అందరూ కృషి చేయాలని సూచించారు .ఇట్టి కార్యక్రమాన్ని జూన్ లో కాకుండా  ఏప్రిల్ లో లేదా మే చివరి వారం లో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పారు 

-ప్రీ ప్రైమరీ తరగతులను ప్రభుత్వ పాఠశాల లో ప్రారంభిస్తే ఎన్రోల్మెంట్ పెరగడఎం టీచర్ ట్రైనింగ్స్ సెలవు దినాలలో జరిపితే బాగుంటుంది

-ఎక్స్పోజర్ విజిట్ టు గుడ్ స్కూల్స్ కార్యక్రమం పెడితే బాగుంటుంది .

-అంగన్వాడీ కేంద్రాల ను ప్రే ప్రైమరీ స్కూల్ తో అనుసంధానం చేస్తే ఎన్రోల్మెంట్ పెరుగుతుంది 

-టీచర్ ట్రైనింగ్స్ సెలవు దినాలలో (Summer vacation) లో జరిపితే బాగుంటుంది

టీచర్స్ ట్రైనింగ్స్ క్వాలిటీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇప్పించడం వల్ల టీచర్ల కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుందని  తద్వారా క్వాలిటీ  పెరగడానికి అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల తీసుకున్న రిసోర్స్ పర్సన్స్ ఎంపిక కమిటీ ద్వారా తీసుకోవడాన్ని స్వాగతించారు మరియు అభినందించారు 

-సైకాలజిస్ట్ తో ఉపాధ్యాయులకు మోటివేషన్   మరియు కౌన్సిలింగ్ నిర్వహించాలి 

-inspection సిస్టం ను బలోపేతం చేయడం ద్వారా క్వాలిటీ ని పెంచవచ్చు 

-రేషనలైజేషన్ ఆఫ్ టీచర్స్ చేస్తే నాణ్యమైన విద్యను  అందివ్వవచ్చు 

-తరగతి గది లో టీచర్స్ విద్యార్థులతో మమేకమవ్వడం అత్యంత అవసరం .

-ప్రభుత్వ పాఠశాల యొక్క face lift చేయాల్సిన అవసరం ఉంది 

-రూల్స్ కి విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి

-కాంప్లెక్స్ మీటింగ్స్ పకడ్బందీగా ఉద్దేశం నెరవేరేలా జరగాలి 

-ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చూస్తే పేరెంట్స్ కు నమ్మకం పెరిగి క్వాలిటీ పెరగడానికి అవకాశం ఉంది 

-స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ని స్కూల్స్ లో అమలు చేస్తే విద్యార్థులు సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడగలరు .

-మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుత టెక్స్టుబుక్స్ సిలబస్ ను మార్పు చేస్తే బాగుంటుంది 

-రెగ్యులర్ DEO లను ,MEO లను నియమించాలని కోరడం జరిగింది .

-పాఠశాలల మానిటరింగ్ ని పెంచాలి 

-స్పోర్ట్స్ ని / ఫిజికల్ ఎడ్యుకేషన్ ని ప్రతి స్కూల్ లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి 

-ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ ని అధికారులు విజిట్ చేస్తే బాగుంటుంది తద్వారా Best practices ని మిగతా స్కూలుకి కూడా అమలు పర్చేలా చూడాలి 

-ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించి స్టూడెంట్స్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి 

-ఉపాధ్యాయులు మెటర్నిటీ లీవ్ లో ,డిప్యుటేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక టీచర్ ని తాత్కాలికంగా నియమించాలి .

-చాలా మంచిగా పనిచేస్తున్న పాఠశాలలు పబ్లిసిటీ చేసుకోవడం లేదు .

ఫ్లెక్సీ ద్వారా ,లోకల్  టీవీ ఛానల్ లో /పత్రికల ద్వారా ప్రచారం చేసుకోవాలి 

-Best school teachers awards ను application method లో కాకుండా అధికారులే గుర్తించి ఇవ్వాలి 

సభలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, విద్యార్ధుల పునాది విద్యాభివృద్ధి, వంటి ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. డా. యోగితా రాణా గారు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో ప్రత్యక్షంగా (one-on-one) పరస్పర చర్చలు జరిపారు.

విద్యా శాఖ, ప్రభుత్వ పాఠశాలల పురోగతికి ఉపాధ్యాయులతో కలసి పని చేయనున్న దృఢ సంకల్పాన్ని ఈ సమావేశంలో పునరుద్ఘాటించింది.

విద్యార్థుల నమోదు మరియు విద్యా నాణ్యత ప్రమాణాలను పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని అన్ని సంఘాల నాయకులు స్వాగతించారు.తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు 

ఇట్టి కార్యక్రమంలో ఈ.వి. నరసింహా రెడ్డి, IAS, పాఠశాల విద్యా డైరెక్టర్ ,Smt ఎ. శ్రీదేవసేన, IAS, కళాశాల మరియు సాంకేతిక విద్యా కమిషనర్, Smt. ఎం. హరిత, IAS, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి, మరియు పాఠశాల విద్యా శాఖకు చెందిన అందరూ అదనపు సంచాలకులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >