విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోనే సమాజం బాగుపడుతుంది
విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి సూచికరమైన భోజనం వడ్డించాలి
మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలోమధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్
పిల్లలతో భోజనం చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్
డైలీ భారత్, మాసాయిపేట:విద్యాభివృద్ధికి రాష్ట్రం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
బుధవారం మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించి పాఠశాలలో
లోని వంట గదులు, వాష్ రూం లలో పరిశుభ్రత ను పరిశీలించారు. స్టోర్ రూం ను , స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు.సరుకుల సరఫరాలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు
స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తరగతి గదులలో 9వ తరగతి విద్యార్థుల విద్యాసామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...
హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల కు క్వాలిటీ విద్య అందేలా చూడడంతో విద్యకు ప్రాధాన్యతనిస్తేనే సమాజం బాగుపడుతుందనీ... ప్రతి కుటుంబం పరిశుభ్రత, విద్యార్థుల భద్రతఫై దృష్టి సారించాలని తెలిపారు విద్యార్థులకు మెనూ ప్రకారం రుచి, శుచికరమైన భోజనం వడ్డించాలి. సూచించారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్టీవో జై చంద్రారెడ్డి, తాసిల్దార్ జ్ఞాన జ్యోతి జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు