డైలీ భారత్, మాసాయిపేట:మాసాయిపేట శివారులో ఏర్పాటు చేసిన హల్ది గోల్డ్ కౌంటి వెంచర్ లోని కుమ్మరి కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి చదును చేస్తుండగా, గ్రామస్థుల నుండి అందిన ఫిర్యాదు మేరకు మాసాయిపేట తాసిల్దార్ జ్ఞానజ్యోతి సమక్షంలో వెల్థుర్థి డిప్యూటీ సబ్ ఇంజనీర్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు సోమవారం సంయుక్తంగా సర్వే నిర్వహించారు. కుమ్మరి కుంటలో అక్రమ తవ్వకాలు జరిపి త్రవ్విన భూమిని గోల్ఫ్
కౌంటి తరలించినట్లు తెలిపారు. ఇట్టి శిఖం గురించి మండల సర్వేయర్ తెలుపుతూ సర్వే నెంబర్ 827 లో ఇప్పటికే సర్వే పూర్తి అయ్యిందని తెలిపారు. సర్వే నెంబర్ 827 పట్టా భూమి అయినప్పటికీ సర్వే నెం. 827 పార్ట్ శిఖం కిందకు వస్తుందన్నారు. కుమ్మరి కుంట భూమి ఎఫ్టీఎల్ శిఖం కిందకు వస్తుందని, త్వరలోనే హద్దులు ఏర్పాటు చేసి, శిఖం భూమిలో అక్రమ తవ్వకాలు చేపట్టిన వారు, అట్టి శిఖం కుంటను యథావిధిగా చేయాలని, త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.