| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి కేబినెట్ సమావేశానికి ట్రాన్స్ కో, జెన్ కో,సిఎండి,ని రప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నేటి కేబినెట్ సమావేశానికి ట్రాన్స్ కో, జెన్ కో,సిఎండి,ని రప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

డైలీ భారత్, హైదరాబాద్:  తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది.. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు.. ఈ భేటీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ముందుగా ముఖ్యమంత్రి విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరు చర్చ జరిగింది.. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.

ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలా కాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులు న్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది.

శుక్రవారం దీనిపై సమీక్ష చేద్దామని అంటూ..ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్‌ ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేయగా.దాన్ని ఆమోదించవద్దని అన్నారు.

నేడు నిర్వహించే సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం ఆదేశించారు.ఇవాళ విద్యుత్‌శాఖపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తున్నారు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి.

Previous తెలంగాణ మహిళలకు రేపటి నుండి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Next వారణాసిలో తెలుగు కుటుంబం ఆత్మహత్య!
ADVERTISEMENT