ఇప్పటికే కిలిమంజారో ఎల్బ్రోస్ అధిరోహించిన మోతి కుమార్
రూ 44 లక్షల ఖర్చు
ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వి ఎం బంజర గ్రామానికి చెందిన బర్మావత్ మూతి కుమార్ ప్రపంచంలోని ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఈ క్రమంలో ఇప్పటికీ మైనస్ 40 డిగ్రీలు వాతావరణ ఉండే దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజ రో (సముద్రమట్టానికి 56 42 మీటర్ల ఎత్తు) పర్వతాలని ఎక్కి సత్తా చాటాడు ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని( 88 44.86) మీటర్లు ఎక్కేందుకు అనుమతి పొందాడు అతడు అనుకున్నది సాధిస్తే తెలంగాణ నుంచి ఎవరెస్ట్ ఎక్కిన ఆరో వ్యక్తిగా మోతి కుమార్ నిలుస్తాడు ఖమ్మం జిల్లాకు చెందిన తొలి యువకుడిగా రికార్డు నమోదు చేస్తాడు. ఇంకా వివరాల్లోకి వెళితే విఎం బంజర గ్రామానికి చెందిన వీధి వ్యాపారస్తులు బర్మావత్ రాజా అలివేలు దంపతుల కుమారుడు మోతి కుమార్ నిరుపేద కుటుంబంలో పుట్టిన అతడికి చిన్నప్పటినుండి ఆటలపై మక్కువ ఎక్కువ పలు క్రీడల్లో ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు చిన్నతనంలోనే తన తాత వెంట పశువులు కాయడానికి వెళ్లి పెద్ద పెద్ద రాళ్లు గుట్టలు ఎక్కేవాడు ఒకరోజు పుస్తకంలో పర్వతారోహణ చేసిన వారిని చూసి ప్రేరణ పొందాడు తాను పర్వతరోహణ చేయాలని నిర్ణయించుకున్నాడు వెంటనే భువనగిరిలోని రాకు కోచింగ్ స్కూల్లో సంప్రదించాడు అక్కడ 15 రోజులు శిక్షణ తీసుకున్న తర్వాత మోతి కుమారు నైపుణ్యం బాగుండడంతో 20 22 ఏప్రిల్ 5న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి అనుమతి సాధించాడు అనంతరం ఆర్మీ అధికారులు పర్యవేక్షణలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న బిరాంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనరీ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ శిక్షణ కేంద్రంలో నెలరోజులపాటు కఠిన శిక్షణ తీసుకుని రష్యాలోని మౌంట్ ఎల్బ్రోస్ పర్వతాన్ని 20 23 నవంబర్ 11న అధిరోహించాడు కిలిమంజారో ఎల్బ్రోలు పర్వతాలు అధిరోహించేందుకు పది రోజులు చొప్పున మొత్తం 20 రోజులు సమయం పట్టింది ఈ రెండు పర్వతాలు అధిరోహణలో ప్రతిభ కనపరిచిన అనంతరం 52 రోజులు సమయం పట్టే ఎవరెస్టు పర్వతం ఎక్కేందుకు అనుమతి లభించింది.
రూ 44 లక్షల ఖర్చు
ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సుమారు 44 లక్షల ఖర్చు అవుతాయి వీటిలో పర్వతారోహణ చేసేటప్పుడు వినియోగించే డ్రెస్ కు రూ 7 లక్షలు క్లైమ్బింగ్ చేసేటప్పుడు తీసుకునే ప్రత్యేకమైన ఆహారానికి రూ 15 లక్షలు లూసుజెన్ సిలిండర్కు 1.35 లక్షలు వీటితో పాటుగా లోన్ పర్సనల్ క్లాతింగ్ కు రూ 4.25 లక్షలు గైడ్ కు రూ 97.800 వీటికి అదనంగా జిఎస్టి రూ 2.12 లక్షలతో కలిసి మొత్తం 44 లక్షల 40 ఖర్చు అవుతుంది
ఆర్థిక సాయం కోసం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎక్కేందుకు భారీగా ఖర్చు అవుతుండడంతో పేద కుటుంబానికి చెందిన మోతి కుమార్ కు ఆర్థిక పరిస్థితి సహకరించటం లేదు. ఎవరెస్టు శిఖరం ఎక్కి దేశం రాష్ట్ర ఖ్యాతి నిలపడానికి తనకు ఆర్థిక స్తోమత లేదని వాపోయాడు ఈ క్రమంలో జిల్లా 320 ఈ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి దాతల సహకారంతో రూ 33,000 జిల్లా ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ట్రావెలింగ్ బ్యాగ్ తో పాటు రూ 10,000 లయన్స్ క్లబ్ వైరా నుండి దాతల ద్వారా రూ 23 వేల రూపాయలు అందించారని మోతి కుమార్ తెలిపాడు గతంలో అధిరోహించిన క్రమంలో జిల్లా లయన్స్ క్లబ్ రూ లక్ష రూపాయలు అందించిందని కే టి పి ఎస్ ద్వారా 2.50 లక్షలు అందించారని మోతి కుమార్ తెలిపాడు.ఇప్పటివరకు నాకు సహకరించిన మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు రీజియన్ జిల్లా క్యాబినెట్ సెక్రెటరీ శివశంకర్ సింహాద్రి జిల్లా జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రెటరీ లగడపాటి ప్రభాకర్ రావు డి జి ఈ మదన్మోహన్ రేపాల ఎస్సీ వి డీజీఈ సతీష్ కుమార్ కోడె తిరునగరి శారద నలగొండ స్నేహ రీజియన్ చైర్మన్ డి పి సి రావు వైరా లయన్స్ క్లబ్ కి చెందిన జీఎస్టీ కోఆర్డినేటర్ ఉండ్రు శ్యాంబాబు అధ్యక్షులు చింతలపూడి వెంకటేశ్వరరావు చింతోజు నాగేశ్వరరావు జోన్ చైర్మన్ పెనుగొండ ఉపేందర్ రావ్ డాక్టర్ పెరుమాళ్ళ కృష్ణమూర్తి మాదినేని సునీత ప్రసాద్ రంగా సత్యనారాయణ గద్దె నీరజ నంబూరు రామారావు కొమ్మిశెట్టి శ్రీధర్ తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా 320 ఈ లయన్స్ జెండాను ఎవరెస్టు శిఖరం పై ఉంచుతానని కుమార్ తెలిపాడు
దాతలు ఎవరైనా సహాయం కొరకు.9346433658 చరవాణి నెంబర్ కు ఫోన్ పే చేసి సహకరించగలరని మోతి కుమార్ అభ్యర్థించాడు