ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దెబ్బెందుల సాయికుమార్ ఆధ్వర్యంలో
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మెయిన్ రోడ్ నిరాహార దీక్షలో భాగంగా ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు దీక్షను పూలదండలు వేసి ప్రారంభించారు,,
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా నాయకులు చెంగల గురునాథం మాదిగ మాట్లాడుతూ,,
కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డీ ప్రభుత్వాన్ని గద్దె దింపేది..ముమ్మాటికీ మాదిగలే..!!
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నిండు అసెంబ్లీ సభలో ఆగస్టు. 1,2024 నాడు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన ప్రతిష్టాత్మక 6:1 జస్టిస్ చంద్ర చూడ్ గారీ ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు ప్రకారం SC రిజర్వేషన్స్ ప్రకారంమే ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనీ చెప్పి.... కుట్ర పూరతంగా వర్గీకరణ చట్టం చేయకుండా
ఆలస్యం చేస్తూ...
రాష్ట్ర సివిల్స్ సర్వీస్ లు అయినా గ్రూప్. 1,2,3 ఉద్యోగాల ఫలితాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైనా ఆలోచన.
పద్మశ్రీ కృష్ణ మాదిగ అలుపెరుగనిపోరాటం గురించి గొప్పగా పొగుడుతూనే రెండు నాలుకల ధోరణితో రేవంత్ రెడ్డీ కుట్రలు చేస్తున్నాడు, అని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు కాకటి కృష్ణ, మండల నాయకులు మంద బాబు, చంగల నరసింహారావు, చిన్న వెంకయ్య, దేవరకొండ రంజిత్, నేలల సూర్య, తదితరులు పాల్గొన్నారు.