డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ కమిటీ హాల్ నందు జరిగిన మాల మహానాడు నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు పూల.రవీందర్ హాజరై నూతనంగా ఎన్నుకున్న సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గ నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇల్లందు నియోజకవర్గంలో మాల మహానాడు బలోపేతానికి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కొరకు, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శక్తి వంచన లేకుండా పోరాటం చేయడానికి కృషి చేయాలన్నారు ఇల్లందు నియోజకవర్గంలో మాల మహానాడు ను, జాతీయ అధ్యక్షులు ఎర్రమళ్ళ. రాములు నాయకత్వంలో గ్రామస్థాయి నుంచి పటిష్టం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఇల్లందుకు చెందిన పండుగ. ప్రసాద్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మంచాల. జానుబాబు,గౌరవ సలహాదారుగా బియ్యాని. గోపాల్, గౌరవ అధ్యక్షులుగా ప్రమిదల.బిక్షం, ఉపాధ్యక్షులుగా రాజు, ట్రెజరర్ గా పిండిగా.బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడ్డి.శ్రీనివాస్ కమిటీ సభ్యులుగా బియ్యాని. రాములు, వీరస్వామి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నుకోబడ్డ ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు పండగ ప్రసాద్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు ఇచ్చినటువంటి జాతీయ అధ్యక్షులు ఎర్రమళ్ళ. రాములు జిల్లా అధ్యక్షులు పూల. రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పాలరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇల్లందు నియోజకవర్గం లో మాల మహానాడు బలోపేతం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది.
News
మాల మహానాడు ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షునిగా పండుగ ప్రసాద్ నియామకం