డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ కొత్త డీజీపీగా రవిగుప్తాను ఎన్నికల సంఘం నియమించింది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీగా అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను ఈసీకి సీఎస్ శాంతికుమారి సిఫార్సు చేశారు.
ఇందులో రవిగుప్తాను కొత్త డీజీపీగా ఈసీ నియమించింది..