| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు.

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల ; శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో సుమారు 1700 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో  పటిష్ట బందోబస్తు.

తెలంగాణ అసెంబ్లీ -2023 ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో 144 సెక్షన్‌ అమలు.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు -2023 సందర్భంగా నవంబర్ 30న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ నవంబర్ 28వ తేదీ(మంగళవారం) సాయంత్రం 5 గంటల తరువాత నుంచి, డిసెంబర్ 1వ తేదీ (సోమవారం ) ఉదయం 7 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎస్పీ  తెలిపారు.

శాంతి యుత వాతవారణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లాలో ఉన్న 560 పోలింగ్ స్టేషన్స్ లలో  సుమారు 1700 మంది జిల్లా, కేంద్ర పోలీస్ బలగాలతో  పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని,ప్రతి మండలానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికరితో ప్రత్యేక పెట్రోలింగ్ పార్టీలు,రూట్ మొబైల్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), స్ట్రయికింగ్ ఫోర్స్ మరియు స్పెషల్ స్ట్రయికింగ్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.


ఈ ఎన్నికల భద్రతా దృష్ట్యా ఎన్నికలు సజావుగా సాగటానికి ఈ దిగువ తెలిపిన నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞాప్తి చేయనైనది.

 జిల్లా పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.

రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు. 

మైకులు, లౌడ్‌ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు. 

విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు.

ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,మరియు ఎన్నికల సంఘం యొక్క  నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

పోలింగ్ జరిగే రోజు పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అంతరాయం కలిగించే ఏదైనా మండే పదార్థాం ఉదాహరణకు టపాకాయలు లేదా ఇతర పదార్థాలను తీసుకెళ్లరాదు.

పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇండ్ల యాజమానులు బయటి వ్యక్తులను ఎవ్వరిని అనుమతించకూడదు. అలాగే పోలీంగ్ స్టేషన్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన వారి ఇండ్ల యాజమానులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

తేది: 28-11-2023 సాయంత్రం 5 గంటల నుండి తేది: 04-12-2023 ఉదయం 6 గంటల వరకు ప్రతీ ఒక్కరు తూచ తప్పకుండా ఎన్నికల నిబంధనలు పాటించగలరు.

ఎన్నికలప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, పై నిబంధనలను ఏ పార్టీవారయిన, ఏ వ్యక్తులు అయిన ఉల్లంఘించిన ఎన్నికల ప్రవర్తన నియమావళి చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Previous నేటి సాయంత్రం నుండి మైకుల లొల్లి బంద్
Next తెలంగాణ ఎన్నికల్లో 3శాతం నుండి 5 శాతం ఓట్లు తేడాతో ఒక ప్రధాన రాజకీయ పార్టీ ఓడిపోతుంది
ADVERTISEMENT