గ్రామపంచాయతీ కార్యదర్శి ని వేడుకుంటున్న గ్రామ ప్రజలు
డైలీ భారత్,కరీంనగర్: కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామంలో గల ఇందిరా నగర్ ప్రాంతంలో పలు వీధుల్లో మురికి నీటి కాల్వలు మరియు సిసి రోడ్లు లేక గత 16 సంవత్సరాలుగా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామపంచాయతీ కార్యదర్శికి ప్రజలు విన్నవించుకుంటున్నారు.
పలు ప్రాంతాల్లో ప్రతి ఇంటి యజమాని స్వంత పైసలతో మురికి నీటి పారుదల సౌకర్యం కోసం పైపులైను ఏర్పాటు చేసుకున్నామన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పనుల్లో భాగంగా మొదటగా మురికి నీటి కోసం కాలువలు నిర్మించాలని, తర్వాత సిసి రోడ్లు వేయాలి అని ప్రజలు కోరుతున్నారు. ప్రజా సమస్యలను గ్రామ కార్యదర్శి గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు.