డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ ఫరుక్ నగర్ మండలం మొగలిగిద్ద గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి సభా ప్రాంగణం తదితర వేదిక ఏర్పాటులను ఆయన పర్యవేక్షించారు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొగలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 15వ వార్షికోత్సవానికి వస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల కోసం అన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ తదితర అధికారులతో పాటు సభకు వచ్చే పూర్వ విద్యార్థులు ప్రజలు నాయకులు తదితరులకు సౌకర్యాల విషయంలో అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశించారు. వాహనాల పార్కింగ్ సభా వేదిక పాఠశాలలో ముఖ్యమంత్రి సందర్శన తదితర అంశాలను వారు పర్యవేక్షిస్తున్నారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, ఐసాక్ తదితరులు పాల్గొన్నారు
News
మొగలిగిద్ద సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్