డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం: ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం పరిశోధకుడు గాడిపెల్లి సునీల్ కుమార్ గౌడ్ డాక్టరేట్ పట్టా సాధించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్. కృష్ణంరాజు సునీల్ కుమార్ కీ డాక్టరేట్ ప్రకటించారు. "రిలేషన్ షిప్ బిట్ విన్ బాడీ టైప్స్ అండ్ ఫిజికల్ ఫిట్ నెస్ వేరియబుల్స్ అమాంగ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ వెస్ట్ తెలంగాణ" అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని సమర్పించినందుకు డాక్టరేట్ లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ఎడ్యుకేషన్ డీన్ సీనియర్ ప్రొఫెసర్. పి. వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో పిహెచ్డి పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గాడిపెల్లి చక్రయ్య - భాగ్యలక్ష్మి కుమారుడు సునీల్ కుమార్ చిన్నతనం నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో చదువుతూ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి వరకు కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విధ్యను అభ్యసించారు. ప్రస్తుతం జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్, జిల్లా కలెక్టర్ల నుంచి అనేక అవార్డులు, రివార్డులు పొందారు. కాకతీయ యూనివర్శిటీ నుండి బీపీఈడి, ఎంకాం గోల్డ్ మెడల్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంపిఈడీ గోల్డ్ మెడల్, పిహెచ్డి డిగ్రీ సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ లో జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సెట్ పరీక్షలో అర్హత సాధించారు. ముంబాయిలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోర్స్ లో ఎన్ఐఎస్ పూర్తి చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మెరిట్ సర్టిఫికెట్ పొందారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ లో ఇరవైకి పైగా రీసర్చ్ ఆర్టికల్స్, జర్నల్స్ తదితర పేపర్ పబ్లికేషన్స్ చేశారు. ఈ పరిశోధన పూర్తి చేయడంలో సహకరించిన పిహెచ్డి గైడ్ ప్రో. వెంకట్ రెడ్డి, డిపార్ట్మెంట్ హెడ్, డైరెక్టర్ ప్రో. రాజేష్ కుమార్, ఎడ్యుకేషన్ డీన్ ప్రో.ఎల్.బి. లక్ష్మికాంత్ రాథోడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్, చైర్మన్ ప్రో. బిడ్ల సునీల్ కుమార్, యూనివర్శిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రెటరీ ప్రో.కే. దీప్లా, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ సందర్భంగా అందరికి డాక్టర్. సునీల్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News
గాడిపెల్లి సునీల్ కుమార్ కీ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్