| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొహెడా మార్కెట్ కు అంతర్జాతీయ గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కొహెడా మార్కెట్ కు అంతర్జాతీయ గుర్తింపు : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయదారులను అప్పుల నుంచి బయటపడేయాలి : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద మార్కెట్ కొహెడాను గత బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి, కాంగ్రెస్ నేత కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి... మంత్రి తుమ్మల నాగేశ్వరరావ దృష్టికి తీసుకెళ్లారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేఎల్ఆర్ మాట్లాడుతూ... మార్కెటింగ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.వ్యవసాయదారులను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు మార్కెటింగ్ ఉద్యోగులు, మంత్రి తుమ్మల కృషి చేయాలని లక్ష్మారెడ్డి అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు... వ్యవసాయ శాఖ ఉద్యోగులు అండగా ఉండి గౌరవించాలని కిచ్చెన్న కోరారు.కర్షకులతోపాటు కూలీలకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్న రైతన్న... తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.కొహెడా మార్కెట్ ను రూ. 2 వేల కోట్లతో అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. అందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు కేఎల్ఆర్. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Previous ఆశ్రమ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
Next మణుగూరు సురక్ష బస్టాండ్ లో గంజాయి పట్టివేత
ADVERTISEMENT